
మోసాలు, అబద్ధాల ఏడాది కూటమి పాలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిందని, మోసాలు, అబద్ధాలతో గత ఏడాదిగా కూటమి పాలన సాగిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల నరకాలన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుణదలలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు చెబుతున్నట్లు ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో వేలాది మంది వస్తే కనీస పోలీస్ భద్రత ఇవ్వలేదని, ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్య మంత్రికి మూడు కార్లు, వంద మందికి మాత్రమే పర్మిషన్ ఉందని అనడాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అవినాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిగా కేవలం వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తప్ప, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం కానీ, అభివృద్ధిగానీ చేసింది శూన్యం అన్నారు. పల్నాడులో వైఎస్ జగన్ పర్యటన కర్ఫ్యూ లాంటి వాతావరణం మధ్య జరిగిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూపర్‌సిక్స్ హామీలపై వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడ వడం, రెడ్‌బుక్ పాలన తప్ప రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన లా అండ్ ఆర్డర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అరెస్ట్ చేయాలి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్