ఘంటసాల(అవనిగడ్డ): ఘంటసాల జలదీశ్వరస్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. మచిలీపట్నంకు చెందిన దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో మూడు నెలల కాలానికి ఈ హుండీని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.3,33,567 వచ్చినట్టు ఆలయ ఈవో యార్లగడ్డ వాసు తెలిపారు. ఓ అజ్ఞాత భక్తుడు రూ.2.50 లక్షలు హుండీలో వేసినట్టు అధికారులు గుర్తించారు. లెక్కింపు కార్యక్రమంలో ఘంటసాల ఏఎంసీ చైర్మన్ వేమూరి వెంకట్రావ్, మండల సచివాలయ కన్వీనర్ వేమూరి ప్రవీణ్, ఘంటసాల పీఏసీఎస్ చైర్మన్ వేమూరి రత్నశేఖర్, ఆలయ ట్రస్టీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఆలయ అర్చకుడు చావలి కృష్ణకిశోర్ పాల్గొన్నారు.