మూడో విడత తొలిరోజు 579
సుభాష్‌నగర్ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 579 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌లోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలకు 57 కేంద్రాలను ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు174, వార్డుస్థానాలకు 405 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.
● ప్రారంభమైన నామినేషన్‌ల స్వీకరణ
● సర్పంచ్ స్థానాలకు 174..
వార్డు స్థానాలకు 405
మూడో విడత తొలిరోజు 579


