ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఎన్ని కల నిర్వహణపై మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొద టి, రెండో విడత నామినేషన్‌ల స్వీకరణ, దాఖలైన నామినేషన్ల వివరాలను కమిషనర్ తెలుసుకున్నా రు. రెండో విడత నామినేషన్‌ల పరిశీలన, మూడో విడతకు సంబంధించిన స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎన్నికల సిబ్బంది కేటా యింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులతో కమిటీలు ఏ ర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నిక ల సాధారణ పరిశీలకుడు జీవీ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రి య సజావుగా జరుగుతోందన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నోడల్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


