నేటి నుంచి మూడో విడత నామినేషన్‌లు
● 57 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి
సుభాష్‌నగర్: మూడో విడత జీపీ ఎన్నికల కోసం నామినేషన్‌ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. సర్పంచ్, వార్డు స్థానాలకు బుధవా రం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నా రు. ఇందు కోసం 59 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 5వ తేదీన సాయంత్రం 5గంట లకు నామినేషన్‌ల ప్రక్రియ ముగియ నుండగా, 6న పరిశీలన, 9న ఉపసంహరణకు గడువు ఉంటుంది. 17న పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది.


