నిబంధనలు పాటించాలి
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్‌ల స్క్రూటినీలో నిబంధనలను పాటించా లని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ, దాఖలైన నామినేషన్‌లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు.


