మూడు ట్రాలీ ఆటోలపై కేసు | - | Sakshi
Sakshi News home page

మూడు ట్రాలీ ఆటోలపై కేసు

Dec 1 2025 7:32 AM | Updated on Dec 1 2025 7:34 AM

మూడు ట్రాలీ ఆటోలపై కేసు వృద్ధురాలి అదృశ్యం మద్యం పట్టివేత కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

రెంజల్‌: బోధన్‌ నుంచి రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాలీ ఆటోలను ఆదివారం తెల్లవారుజామున పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. వీటిని మైన్స్‌ అధికారులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

బోధన్‌టౌన్‌: బోధన్‌ పట్టణంలోని రాకాసీపేట్‌ కాలనీకి చెందిన కోదండం ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ ఆదివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాకాసీపేట్‌ కాలనీకి చెందిన కోదండం ఎల్లమ్మ శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుమారుడు పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం మండల కేంద్రం నుంచి పోచారం తండాకు తరలిస్తుండగా మర్గమధ్యలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 3,100 కలిగిన 5 బీర్‌ సీసాలు, 12 లిక్కర్‌ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నాగిరెడ్డిపేట: మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన చౌహాన్‌ అలియాస్‌ కమ్మరి లక్ష్మి(26) అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి భర్త వినోద్‌కుమార్‌ మూడేళ్లక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వినోద్‌కుమార్‌ మృతితో వచ్చిన బీమా డబ్బులతోపాటు ఆస్తి విషయమై లక్ష్మికి అతని భర్త బంధువులతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి ఇరువురు రాజీపడ్డారు. దీంతో లక్ష్మిని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 24న ధర్మారెడ్డిలోని అత్తాగారింట్లో ఉంచారు. కాగా ఆస్తితోపాటు బీమా డబ్బుల విషయమై తన కుమార్తెతో జరిగిన గొడవల కారణంగానే చనిపోయిందని, ఆమె మృతికి అత్త, మామతోపాటు వారి బంధువులు కారణమని మృతురాలి తల్లి శాంతబాయి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకొని ఆదివారం గాంధారిలో ఆమె తల్లిగారి బంధువులు రావడంతో మండలంలోని ధర్మారెడ్డిలో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

మూడు ట్రాలీ ఆటోలపై కేసు1
1/3

మూడు ట్రాలీ ఆటోలపై కేసు

మూడు ట్రాలీ ఆటోలపై కేసు2
2/3

మూడు ట్రాలీ ఆటోలపై కేసు

మూడు ట్రాలీ ఆటోలపై కేసు3
3/3

మూడు ట్రాలీ ఆటోలపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement