సస్యరక్షణే.. నారుకు రక్షణ
పురుగుల వ్యాప్తిని అడ్డుకోవడం ఇలా..
ధర్పల్లి: వరి కోతలు పూర్తి కావడంతో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో సాగునీటి వనరులు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో బోరు బావులు, కాలువలు, చెరువుల కింద యాసంగిలో మళ్లీ వరి సాగుకే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో దుక్కులు దున్ని వరి నారును పెంచుతున్నారు. చాలా చోట్ల వరి నారు పెరిగే దశలో ఉంది. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం నారుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వరి నారు ఎదగక పోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి కర్రలు చనిపోవడం జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో నారు సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలో ధర్పల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ వివరించారు.
నాటేందుకు నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి.
నారు కొనలను తుంచి నాటుకుంటే కాండం తొలుచు పురుగుల గుడ్లను నిరోధించి, పురుగులు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు.
పొలంలో పశువుల ఎరువును లేదా కోళ్ల ఎరువును వేసి, దుక్కి చేయవచ్చు. ఎకరాకు 24 కిలోల భాస్వరం, 48 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్ వేయాలి.
చివరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను చల్లాలి. దీన్ని మిగతా ఎరువులతో కలపకుండా నేరుగా వేయాలి.
వరి నారుకు
సోకుతున్న తెగుళ్లు
అధిక చలి తీవ్రతతో నారుపై తీవ్ర ప్రభావం
సస్యరక్షణ చర్యలపై
వ్యవసాయ అధికారుల సూచనలు


