
వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం
బాల్కొండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో అంతా యాంత్రికమైంది. అందులో భాగంగా పంటల్లో గడ్డి మందు, పురుగు మందు పిచికారి కోసం డ్రోన్ పంపులను వినియోగిస్తున్నారు. డ్రోన్ పంపు ధర రూ. 5 లక్షల వరకు ఉంటుంది. పది నిమిషాల వ్యవధిలో ఎకరం పంటలో మందును పిచికారి చేస్తుంది. వ్యవసాయంలో డ్రోన్ సాయంతో మందుల పిచికారి ఎంతో సొంపుగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ. 500 తీసుకుని పంపు స్ప్రే చేస్తున్నారు. మందు కూడా పూర్తి స్థాయిలో వినియోగం జరుగుతుందని అంటున్నారు. డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల శ్రమ తగ్గడంతో పాటు ధర కూడ తక్కువే అవుతుందని రైతులు పేర్కొంటున్నారు.