డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

Jul 2 2025 5:08 AM | Updated on Jul 2 2025 5:16 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

మోపాల్‌: నగరంలో నిర్వహించిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి సమావేశానికి హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు మంగళవారం రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ డెలిగేట్‌, నిర్మల్‌ జిల్లా పరిశీలకులు బాడ్సి శేఖర్‌గౌడ్‌ ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించారు.

నిజామాబాద్‌ సిటీ: ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వ స్తుందని మాట్లాడుతున్నారని, డబుల్‌ ఇంజిన్‌ స ర్కార్‌తో ఏమీ లాభం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. నగరంలో మంగళవారం ని ర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్లమెంటరీ వి స్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీ జేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి లేదన్నా రు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉన్న రాష్ట్రాల్లో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేషన్‌ దు కాణాల్లో మోదీ బొమ్మ పెట్టాలనడం అర్థరహితమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకా లు అమలుచేస్తున్నా, వాటిని క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయడంలో మాత్రం వెనుకబడి ఉన్నామన్నా రు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చా టాలన్నారు. విభేదాలు పక్కనపెట్టి అంతా కలిసి మెలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మా ట్లాడుతూ.. పాత, కొత్త తేడా లేకుండా కార్యర్తలు, నాయకులు కలిసిమెలిసి పనిచేయాలన్నారు. బోధ న్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రే వంత్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలు చూసి బీఆర్‌ఎ స్‌ నాయకులు అసూయపడుతున్నారన్నారు. రూర ల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డుతో కాకుండా, మద్దతు ధర లభించినప్పుడే పసుపు రైతుల కళ్లల్లో ఆనందం వస్తుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ తదితరులు మాట్లాడారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

నగరంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌

పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు1
1/6

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు2
2/6

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు3
3/6

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు4
4/6

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు5
5/6

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు6
6/6

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement