
ఒకరి ఆత్మహత్య
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నాంపల్లి రాములు(53) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్‌ఐ మహేష్ వెల్లడించారు. రాములు మృతికి గల కారణాలు తెలియరాలేదని అతడి తల్లి పోశవ్వ ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని పులాంగ్ వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. అతడు బ్రౌన్ కలర్ నైట్ ప్యాంట్ ధరించాడని, ఎవరికై నా తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్‌లో గాని, 8712659840, 8712659719ను సంప్రదించాలని సూచించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కామారెడ్డి క్రైం: కామారెడ్డి రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌ఫాం పక్కనే ఉన్న ఓ గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించగా, పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతడి వయస్సు 30–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నలుపు, తెలుపు రంగుల పూల షర్టును ధరించాడన్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్‌హెచ్‌వో నరహరి కోరారు.
డ్రంకన్‌డ్రైవ్ కేసులో పలువురికి జైలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఇటీవల డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 17మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డట్లు ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. వారికి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం వారిలో ఆరుగురికి జరిమానా వేయగా, ఆరుగురికి ఒక రోజు, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
నవీపేట: నవీపేట శివారులో పోలీసులు ఇటీవల డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, మంగళవారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి అతడికి 7రోజుల జైలుశిక్ష విధించారు.
మోత్కూర్ పోలీసుల అదుపులో జిల్లా వృద్ధుడు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాకు చెందిన వృద్ధుడు యాద్రాది జిల్లా మోత్కూర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన దండు గోవర్ధన్(60) అనే వృద్ధుడు మోత్కూర్‌లో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇతని వివరా లు తెలిసినవారు మోత్కూర్ పీఎస్ 70970 52763 లేదా నాలుగో టౌన్ పోలీసులు 87126 59840, 8712659719ను సంప్రదించాలన్నారు.

ఒకరి ఆత్మహత్య

ఒకరి ఆత్మహత్య