
పరీక్ష ఫీజు చెల్లించండి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బీఈడీ, బీపీఎడ్ రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ (2024–25), బ్యాక్ లాగ్ (2021 విద్యా సంవత్సరం) 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 14వరకు చెల్లించాలని కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 100 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్
టోర్నమెంట్ విజేత రంగారెడ్డి
● రన్నర్‌గా నిజామాబాద్
● విజేతలకు ట్రోఫీ ప్రదానం చేసిన
సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ నాగారం/ఖలీల్‌వాడి: జిల్లాకేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో వి జేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలువగా, రన్నర్‌గా నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశా రు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆటలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. విన్నర్, రన్నర్ టీమ్‌లను అభినందించారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, జావిద్, కరీం, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు బొబ్బిలి నర్సయ్య, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష ఫీజు చెల్లించండి