
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వెజిటేబుల్ ఆటో–మోటర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శివకుమార్ అన్నారు. నగరంలోని కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఇమ్రాన్, సురేశ్, బాబా ప్రసాద్, హైమద్, రంజిత్ పాల్గొన్నారు.