
నాణ్యత డొల్ల!
● పనులు చేపట్టిన మూడు నెలలకే పగుళ్లు ఏర్పడిన రోడ్డు
ఇందల్వాయి: ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గంలో వెంగల్‌పాడ్ వద్ద నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనకు ఇరువైపుల వేసిన రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కుంగి ప గుళ్లు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి మ న్నికగా ఉండాల్సిన రోడ్డు మూడు నెలలకే కుంగడంపై వాహనదారులు నాణ్యత లోపాలను విమర్శిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల పోసిన మొరం వర్షానికి కొట్టుకుపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పాడవకముందే మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.