
వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి
మోపాల్: వ్యవసాయరంగంలో కూలీల కొరతను అధిగమించేందుకు సాంకేతికతను జోడించాలని, తద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని డివిజనల్ ఆగ్రోనామిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బాడ్సి సొసైటీ పరిధిలో అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 ఉత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి డ్రోన్ సాంకేతికత ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు డ్రోన్ ప్రదర్శనను చేపట్టారు. డ్రోన్ల వినియోగం, వాటి పద్ధతులు, ప్రయోజనా లు, వ్యవసాయ రంగంలో వాటి పాత్రపై నానో బి జినెస్ మేనేజర్ ఎల్‌ఎస్ స్వరూప్, సీనియర్ ఆగ్రోనామిస్ట్ పాపిరెడ్డి, ఆగ్రోనామిస్ట్ డాక్టర్ వంశీ రైతులకు వివరించారు. డ్రోన్ల సహాయంతో కీటక నాశినుల స్ప్రే, పంటల ఆరోగ్య నిర్ధారణ, భూమి పర్యవేక్షణ, తదితర అంశాలపై వ్యవసాయ క్షేత్రంలో ప్ర దర్శనలిచ్చారు. రైతులు ప్రత్యక్షంగా వీక్షించి, నిపుణులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసు కున్నారు. బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్‌రెడ్డి, డైరెక్టర్ పృథ్వీరాజ్, సహకారశాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎం శ్రీనివాస్, రైతులు మహిపాల్‌రెడ్డి, శే రు మల్లయ్య, ఉపసర్పంచ్ రవి, రైతులు, సంఘాల ప్రతినిధులుపాల్గొన్నారు.
డివిజనల్ ఆగ్రోనామిస్ట్
డాక్టర్ సుధాకర్‌రెడ్డి
బాడ్సిలో జిల్లాస్థాయి డ్రోన్
సాంకేతికత ప్రదర్శన