
మాజీ ప్రధాని పీవీ బహుభాషా కోవిదుడు
నుడా చైర్మన్ కేశ వేణు
మోపాల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుభాషా కోవిదుడు అని, ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. శనివారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నర్సింహారావు 104వ జయంతి సందర్భంగా నగరశివారులోని బోర్గాం(పి) చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ కులకర్ణి మాట్లాడుతూ.. బ్రాహ్మణ ముద్దుబిడ్డ, అపర చాణక్యుడు పీవీ నర్సింహారావు అని, వారిని భారతరత్నతో గతంలోనే కేంద్ర ప్రభుత్వం సత్కరించడం బ్రాహ్మణ జాతికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నుడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, బ్రాహ్మ ణ సంఘం ప్రతినిధులు కంజర్‌కర్ భూపతిరావు, రమేశ్‌బాబు,కోళవి విజయ్‌కుమార్, మిలింద్, రమే శ్, కిరణ్ దేశ్‌ముఖ్, పుల్కల్ రమేశ్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, జయంత్‌రావు, మల్లికార్జున్, లక్ష్మీకాంత్, అప్పాల కిష్టయ్య, అమర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో..
నిజామాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని తెలంగా ణ భవన్‌లో శనివారం నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహరవు జయంతి వేడుకల్లో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పాల్గొన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.