
రోడ్డు ఇలా.. హైస్కూల్‌కు వెళ్లేదెలా..
డిచ్‌పల్లి: మండలంలోని రాంపూర్‌లో ప్రధాన బీటీ రోడ్డు పూర్తిగా గుంతలు పడి అధ్యానంగా మారింది. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఇదే రోడ్డుగుండా జెడ్పీ హైస్కూల్‌కు వెళ్తుంటారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. నీరు ఎక్కువగా నిలిచినప్పుడు గుంతలు కనబడక సైకిల్ పై వెళ్లే విద్యార్థులు, బైక్‌లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు.