
రైతు ఉద్యమం.. పసుపు బోర్డు
పసుపు బోర్డు కోసం 2019లో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా చేస్తున్న రైతులు (ఫైల్)
వినాయక్‌నగర్‌లో ప్రారంభానికి ముస్తాబైన పసుపు బోర్డు కార్యాలయ భవనం
ఆర్మూర్: జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు లో ఆర్మూర్ ప్రాంత రైతాంగానిది కీలక పాత్ర. పసుపు బోర్డు కావాలనే నినాదాన్ని ఉద్యమంగా మల్చిన రైతులు అనుకున్నది సాధించారు. 2007 లో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కోటపాటి నర్సింహనాయుడు పసుపు బోర్డు నినాదం ఇచ్చా రు. రాజకీయాలకు అతీతంగా రైతులు స్వచ్ఛందంగా పచ్చ కండువాలు భుజాన వేసుకుని ముందుకు కదిలారు. రైతులు జరిపిన ఉద్యమ తీవ్రతకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏవైనా పసుపు బోర్డు అంశం కేంద్రంగానే నేతలు హామీలు ఇచ్చేలా పరిస్థితి వచ్చింది.
పసుపు పరిశోధన కేంద్రం, పసుపునకు గిట్టుబాటు ధర, పసుపునకు పొగాకు తరహాలో ప్రత్యేక బోర్డు.. ఈ మూడు నినాదాలతో పసుపు రైతుల సంఘం చేపట్టిన ఉద్యమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 2009లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కమ్మర్‌పల్లిలో 36 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటైతేనే తమకు గిట్టుబాటవుతుందని ఆశించిన రైతులు ఢిల్లీ వీధుల్లో సైతం పలు మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో మహబూబ్‌నగర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాని నోట పసుపు బోర్డు ప్రకటన ఆర్మూర్ రైతులు ఏళ్లుగా జరిపిన ఉద్యమ విజయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వేళ పసుపు బోర్డు సాధిస్తానంటూ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అర్వింద్ రెండు పర్యాయాలు ఎంపీగా గెలవడం గుర్తు చేసుకోవాల్సిన అంశం. ఇది పసుపు రైతుల ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నామినేషన్లు వేయడానికి వెళ్తున్న రైతులు(ఫైల్)
ఢిల్లీకి వినిపించిన రైతు నినాదం
2019 పార్లమెంట్ ఎన్నికల్లో
178 మంది రైతుల నామినేషన్‌లు
ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ బాక్సు పద్ధతిలో ఎన్నికలు జరిపిన అధికారులు
మోదీపైనా వారణాసిలో నామినేషన్లు వేసిన 25 మంది రైతులు,
పోటీలో నిలిచిన ఏర్గట్ల రైతు ఇస్తారి
రైతులకు బాండ్ రాసిచ్చిన అర్వింద్
చివరికి అనుకున్నది
సాధించుకున్న రైతన్నలు
రైతు ఉద్యమాల్లో ప్రత్యేక గుర్తింపు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా రైతాంగానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ ముఖ్యులు పలుమార్లు ప్రకటించారు. ఇచ్చిన హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. పసుపు రైతుల సమస్యలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ ప్రభుత్వానికి పసుపు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్, అంకాపూర్, ఆర్మూర్ మండలం
2007 ఎన్నికల నుంచే పసుపు బోర్డు నినాదం
పసుపు సాగు వ్యయం పెరిగి గిట్టుబాఽటు ధర లభించకపో వడంతో 2007లో చేపట్టిన ఉద్యమంలోనే మొదటి సారి గా పసుపు బోర్డు నినాదాన్ని తీసుకున్నాం. రైతుల ఉద్య మాలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి తోడైంది. జిల్లా కేంద్రంలో జాతీయ కార్యాలయం ఏర్పాటు కా వడం ఈ ప్రాంత రైతుల విజయం.
– కోటపాటి నర్సింహనాయుడు,
పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్మూర్

రైతు ఉద్యమం.. పసుపు బోర్డు

రైతు ఉద్యమం.. పసుపు బోర్డు

రైతు ఉద్యమం.. పసుపు బోర్డు

రైతు ఉద్యమం.. పసుపు బోర్డు