
రైతుల 30 ఏళ్ల కల పసుపు బోర్డు
సుభాష్‌నగర్: రైతుల 30 ఏళ్ల పసుపు బోర్డు కల నెరవేరిందని, స్పైసెస్ బోర్డు నుంచి పసుపు బోర్డు వేరు చేసి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి ఎంతో ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ పరిశీలకురాలు బంగారు శృతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ ఎంతో శ్రమించి పసుపు బోర్డును సాధించారని, రైతులు ఢిల్లీ వెళ్లే శ్రమ లేకుండా పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. పసుపు బోర్డు కా ర్యాలయ ప్రారంభోత్సవం, రైతు సమ్మేళన కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో తరలివ చ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు తెలంగాణకు ఎంతో ఉప యోగకరంగా ఉంటుందన్నారు. పరిశ్రమల రాకతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొ న్నారు. ఎంపీ అర్వింద్ బోర్డు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయ ని గుర్తుచేశారు. కానీ అర్వింద్ అవేవీ పట్టించుకోకుండా పట్టుబట్టి విక్రమార్కుడిలా పసుపు బోర్డును సాధించడంతోపాటు జిల్లాలోనే కార్యాలయం ఏర్పాటయ్యేలా, చైర్మన్‌గా జిల్లా రైతు బిడ్డనే నియమించేలా కృషి చేశారని కొనియాడారు. వ్యవసాయ రంగానికి ఇందూరు కేంద్రబిందువు కానుందన్నారు. అవహేళన చేసిన వారి కళ్లు చెదిరిపోయేలా బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని పేర్కొన్నారు.
పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం, రైతులతో ముఖాముఖి, కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో డీఎస్ విగ్రహావిష్కరణ, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళన కార్యక్రమం ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు దినేశ్ కులాచారి వివరించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు, ప సుపు బోర్డు ఉన్నతాధికారులు పాల్గొంటారని తె లిపారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అర్వింద్ కృషితో సాకారమైంది
రైతు సమ్మేళనాన్ని
విజయవంతం చేయాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బంగారు శృతి