
ప్రత్యేక పారిశుధ్య పనుల పరిశీలన
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ పరిశీలించారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కంఠేశ్వర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన డీఎస్ విగ్రహం, ఐలాండ్ పనులను పరిశీలించిన ఆయన.. పనులను వేగవంతం చేయాలని ఏఈ వాజీద్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్ పరిసరాలను పరిశీలించి పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. కలెక్టరేట్ నుంచి కంఠేశ్వర్ బైపాస్, పాలిటెక్నిక్ గ్రౌండ్, ఆర్యనగర్‌లోని పసుపు బోర్డు కార్యాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా వి విధ పనులు చేయించారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ ప్రహరీ పక్కన ఉన్న పండ్ల బండ్లను తొలగింపజేశారు. రోడ్డుపై ఆక్రమనలను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఏఎంసీ జయకుమార్, సూపర్‌వైజర్ సాజిద్, ఎస్‌ఐలు శ్రీకాంత్, షాదుల్లా, సునీల్, సాల్మన్‌రాజ్ తదితరులున్నారు.
దరఖాస్తులకు ఆహ్వానం
నిజామాబాద్‌అర్బన్: వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస క్తి గల వారు జూలై 12వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే 14వ తేదీలోగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండి, ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన దరఖాస్తుదారుల కు టుంబ సంవత్సర ఆదాయం రూ.1.50 లక్ష లు, పట్టణ ప్రాంతల వారికి రూ.2 లక్షల ఆదాయం మించొద్దని తెలిపారు.
ఉత్తమ టీచర్ అవార్డు కోసం..
నిజామాబాద్‌అర్బన్: జాతీయ ఉత్తమ టీచర్ అవార్డుల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో అశోక్ కోరారు. 2025 సంవత్సరానికి గాను అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేవారు సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. జూలై 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాల్పోల్ శివార్లలో
ఎలుగుబంటి సంచారం
మోపాల్: మండలంలోని కాల్పోల్ శివారు అటవీప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఈ మేరకు ఓ వీడియో శనివారం వైరల్ కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న సమయంలో అటువైపు వెళ్లిన గ్రామస్తులు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. ఎలుగుబంటి సంచరిస్తోన్న విషయం వాస్తవమేనని, మంచిప్ప అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అటవీప్రాంతం గుండా ఒంటరిగా వెళ్లొద్దని, ద్విచక్రవాహనదారులు, కా ర్లు నడిపేవారు హారన్ ఇవ్వాలన్నారు. ము ఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రత్యేక పారిశుధ్య పనుల పరిశీలన