
స్వచ్ఛమైన కల్లును అందించాలి
● జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి
రుద్రూర్: గీత వృత్తి కార్మికులు స్వచ్ఛమైన కల్లును అందించాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. కోటగిరి మండలం రాంపూర్ శివారులో గతంలో నాటిన ఈత వనాలను శుక్రవారం పరిశీలించారు. హరితహారం ద్వారా నాటిన ఈత మొక్కలను శ్రద్ధగా పెంచడం వల్లే నేడు స్వచ్ఛమైన కల్లు తీయడానికి సిద్ధంగా ఉన్నాయని గీత కార్మికులు అధికారికి వివరించారు. ఐదేళ్ల క్రితం ఈత వనం పెంపకానికి నాటి ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో సూమారు ఐదు వేల మొక్కలు నాటి పెంపకం చేపట్టారు. ఈతవనం పరిశీంచిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆరువేల కుటుంబాలు ప్రత్యక్షంగా, 40వేల కుటుంబాలు పరోక్షంగా గీత వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. కల్తీ కల్లును అరికట్టేందుకు గత ప్రభుత్వ హాయంలో జిల్లాలో ఈత, ఖర్జురా మొక్కలను ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నాటగా ప్రస్తుతం అరవై శాతం పెరిగి కల్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వచ్చే నెల 1న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కల్తీ కల్లును అరికట్టేందుకు ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డీటీఎఫ్ సీఐ విలాస్ కుమార్, ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావు, ఎస్సై జమీల్, ఎ విఠల్ గౌడ్, శంకర్ గౌడ్, అరుణ్ గౌడ్, శ్రీధర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు పాల్గొన్నారు.
సొసైటీ అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి
మాక్లూర్: మాక్లూర్ సొసైటీలో అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ డైరెక్టర్ గంగోనె గంగాధర్ రాష్ట్ర వ్యవసాయ సహకార కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సొసైటీ పాలకవర్గంలోని కొందరు సభ్యులు, సిబ్బంది, మాజీ సీఈవోలు కలిపి రూ. 5 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. అధికారుల ఎంకై ్వరీ నివేదిక మేరకు సంఘం నిధులు దుర్వినియోగం చేసిన వారిని తొలగించి, దుర్వినియెగం చేసిన సొమ్మును రాబట్టాలని కోరారు.