
హోంగార్డ్స్‌కు ఉలెన్ జాకెట్స్ అందజేత
ఖలీల్‌వాడి: నగరంలోని సీపీ కార్యాలయంలో హోంగార్డులకు సీపీ సాయిచైతన్య ఉలెన్ జాకెట్స్‌ను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం, చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నందున ముందు జాగ్రత్తలో భాగంగా జిల్లాలోని 369 మంది హోంగార్డ్స్‌కు ఉలెన్ జాకెట్స్‌ను అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ విభాగం ఇన్‌చార్జి రిజర్వ్ సీఐ సతీశ్, వెల్ఫేర్ విభాగం రిజర్వ్ సీఐ తిరుపతి, హోంగార్డులు తదితరులు ఉన్నారు.
‘ఖిల్లా’ను సందర్శించిన దాశరథి శతజయంతి కమిటీ
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఖిల్లా రఘునాథ రామాలయాన్ని దాశరథి శతజయంతి కమిటీ సభ్యులు సాయికుమార్, లింగం, సీతయ్య, నర్సారెడ్డిలు శుక్రవారం సందర్శించారు. ఖిల్లాలోని దాశరథి కృష్ణమాచార్యులను బంధించిన జైలు గదిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లాను దాశరథి స్మృతి వనంగా మార్చాలని, భావితరాలకు దాశరథి పోరాట పటిమ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాలని కోరారు.
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ
సిరికొండ: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో నారాయణపల్లె గ్రామానికి చెందిన చౌట్‌పల్లి నేహ ప్రతిభ చాటినట్లు ఆమె తండ్రి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో నేహ ప్రతిభ చాటి బంగారు పతకం సాధించింది. జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కళాశాలలో నేహ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

హోంగార్డ్స్‌కు ఉలెన్ జాకెట్స్ అందజేత

హోంగార్డ్స్‌కు ఉలెన్ జాకెట్స్ అందజేత