
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఖాళీ కావడం ఖాయం
బాల్కొండ: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఖాళీ కావడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. బీజేపీలోకి పదవులు ఆశించి రావొద్దని, కేవలం సేవ చేయాలనే భావనతో రావాలన్నా రు. బీజేపీలోకి చేరికలు తప్ప బయటకు పోయే పరి స్థితి ఉండదన్నారు. గతంలో నిజామాబాద్ కార్పొ రేషన్‌లో బీజేపీ టికెట్‌పై గెలిచిన 10 మంది కార్పొరేటర్లు వేరే పార్టీకి వెళ్లి తిరిగి మళ్లీ బీజేపీలో 14 మందితో చేరారన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ని ర్వహించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ కు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, జి ల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, బాల్కొండ, ము ప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు అంబటి నవీన్, సంతోష్‌రెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
బీజేపీలో భారీగా చేరికలు..
బీజేపీలో బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ అర్వింద్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ముప్కాల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, బాల్కొండ మాజీ ఎంపీపీ లావణ్యాలింగాగౌడ్, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ వెంకట్‌రాజ్, ముప్కాల్ మాజీ ఉపసర్పంచ్ సువర్ణలింగం, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుంకం శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి ఎంపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్