
షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
నిజామాబాద్ రూరల్ : నగరంలోని నాందేవ్‌వాడలోని ఆరే మరాఠా సమాజ్ సంఘం షెడ్డు నిర్మాణానికి సభ్యులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఎంపీ అర్వింద్ మంజూరు చేసిన నిధులతో పనులు ప్రారంభించినట్లు సభ్యులు తెలిపారు. ఆర్య మరాఠా సమాజ్ సంఘ అధ్యక్షులు దిగంబరావ్ పవర్, డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
బంజారా సేవా
సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్‌నాగారం: నగరశివారులోని పాంగ్రా బ్యాంక్ కాలనీలోని కమ్యూనిటీ భవనంలో బంజారాల ప్రత్యేక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈసమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేనావత్ శ్రీహరి ఆధ్వర్యంలో బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామావత్ మోహన్‌నాయక్, ప్రధాన కార్యదర్శిగా కేతావత్ పీర్‌సింగ్‌నాయక్, ఉపాధ్యక్షులుగా రంజ్యానాయక్, బన్నీనాయక్, ఎం.కిషన్‌నాయక్, సంయుక్త కార్యదర్శులుగా మోతిలాల్, జోర్‌సింగ్, బానోత్ రంజ్యానాయ క్, కిషన్‌నాయక్, రాములునాయక్‌తోపా టు ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గసభ్యులను సేనావత్ శ్రీహరి సన్మానించారు. కార్యక్రమంలో బంజారా నాయకులు బాదావత్ శంకర్‌నాయ క్, బానోత్ గోపాల్‌నాయక్, మాజీ ఎంపీపీ ప్రేమ్‌నాయక్,రాజశేఖర్,రవి తదితరులున్నారు.
మహిళా సంఘాలను
బలోపేతం చేయాలి
ఇందల్వాయి: మండలంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సెర్ప్ ఐబీ డైరెక్టర్ భారతి అన్నారు. ఇందల్వాయి రైతు వేదికలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె శుక్రవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.నూతనంగా ఎన్నికై న మహిళా సంఘాల పదాతిపతులు సంఘంలోని సభ్యులందరికీ రుణాలు అందేలా వారు రుణాన్ని సకాలంలో చెల్లించేలా కృషి చేయాలని సూచించారు.కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన సీఆర్పీ లు మహిళా సంఘాల అధ్యక్షులకు ఆర్థిక పద్దు ల నిర్వహణ సభ్యులతో సమన్వయం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం సువర్ణ, ఐబీ డీపీఎం శ్రీనివాస్, ఏటీఎం సరోజిని, సీసీ ఉదయ్ తదితరులున్నారు.

షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

షెడ్డు నిర్మాణానికి భూమిపూజ