
డ్యూటీకి డుమ్మాకొట్టేవారిపై చర్యలు
నిజామాబాద్ సిటీ : మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహించకున్నా వేతనాలు పొందేవారిపై కమిషనర్ దిలీప్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఈనెల 25న ‘‘డ్యూటీ చేయకున్నా ఠంచన్‌గా వేతనాలు’’ పేరుతో వచ్చిన కథనానికి బల్దియా కమిషనర్ స్పందించారు. డిప్యూటీ కమిషనర్ రవిబాబును విచారించాల్సిందిగా ఆదేశించారు. దాంతో శుక్రవారం అకౌంట్స్ సెక్షన్, రెవెన్యూ విభాగంలో కూడా విచారించారు. వీరిలో కొందరు ఉద్యోగులు డ్యూటీకీ రాకున్నా వేతనాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. డుమ్మాకొడుతున్నవారికి పూర్తివేతనం ఇవ్వాలని సిఫారసు చేసినవారికి మెమోలు ఇవ్వనున్నట్లు తెలిసింది. సాక్షి కథనంతో గత ప్రజాప్రతినిధుల వద్ద పనులు చేసే సిబ్బందిలో ఒకరిద్దరు శుక్రవారం విధులకు హాజరయ్యారు. మరికొందరు అస్సలురాలేదు. ఇలాంటి ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని కమిషనర్ దిలీప్ కుమార్ హెచ్చరించినట్లు తెలిసింది.
విచారణ చేపడుతున్న డీసీ రవిబాబు
ఇప్పటికే పలువురి గుర్తింపు
మెమోలు ఇవ్వనున్న అధికారులు

డ్యూటీకి డుమ్మాకొట్టేవారిపై చర్యలు