
జాతీయస్థాయి స్విమ్మింగ్‌లో గోల్డ్‌మెడల్
నవీపేట: మండలంలోని బినోల గ్రామానికి చెందిన స్విమ్మింగ్ క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలో బంగారు పతకం సాధించింది. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్(కళింగ స్టేడియం)లో ఈ నెల 22 నుంచి 26 వరకు అక్విటిక్ నేషనల్ చాంపియన్‌షిప్ (2025) పోటీలు నిర్వ హించారు. అందులో భాగంగా 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో జరిగిన పోరులో 33.98 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించిన రిత్విక బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా రిత్వికను పీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూ ర్యనారాయణ గుప్త అభినందించినట్లు క్రీడాకారిణి తండ్రి మిట్టపల్లి ప్రకాశ్‌రావ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కార్యదర్శి ఉమేశ్, జిల్లా ప్రతినిధులు గడీల శ్రీరాములు, శ్యాంసుందర్‌రెడ్డి, వేణుగోపాల్, రాగిణి, శ్రీనివాస్‌లు అభినందించారన్నారు. కాగా, వచ్చే నెల 14 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్ యూనివర్సిటీ పోటీలలో ఇండియా నుంచి రిత్విక పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఘనత