
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి
సుభాష్‌నగర్: డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫౌమ్‌హౌస్ నుంచి పాలన సాగిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ఆదేశాలతో పాలన కొనసాగిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకూ మెడలు వంచుతామని హెచ్చరించారు. అరెస్టులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టే పరిస్థితి లేదన్నారు. ఇదే చివరి రైతుభరోసా కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని ఎద్దేవాచేశారు. ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీని విధించిందని విమర్శించారు. అన్ని పథకాలకు ఇందిరమ్మ పేర్లు పెడుతున్నారని, కాంగ్రెస్‌ది కుటుంబ పాలన అని, గాంధీల పేరుతో కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గ్రా మాల్లో తిరిగే పరిస్థితి లేదని, రైతు సంబరాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపా డే ఏకై క పార్టీ బీజేపీ అన్నారు. ఎంపీ అర్వింద్ వల్లే నిజామాబాద్‌లో పసుపుబోర్డు సాధ్యమైందన్నారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే అమిత్ షా రైతు సమ్మేళన బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మహేశ్వర్‌రెడ్డి కోరారు. అనంతరం పాలిటెక్నికల్ కళాశాల మైదానాన్ని ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి పరిశీలించారు. వారి వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తారక్ వేణు, మధు, ఇప్పకాయల కిశోర్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ ఆదేశాలతోనే రాష్ట్రంలో
కాంగ్రెస్ పాలన
అమిత్ షా సభకు రైతులు తరలిరావాలి
బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రైతు సమ్మేళనం బహిరంగ సభాస్థలి
పరిశీలన