
నాణ్యమైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు
నిజామాబాద్ అర్బన్ : పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇప్పటి నుంచే మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విద్యాశాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీల నిర్వహణ తీరుతెన్నులు, గత సంవత్సరం సాధించిన ఫలితాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో హడావుడి పడకుండా ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తే అ త్యుత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ ప్రభుత్వ బడులలో కార్పొరేట్‌కు దీటు గా విద్యా బోధన జరిగేలా చూడాలని డీఈవో అశోక్‌ను ఆదేశించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శా స్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల ని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి వి ద్యార్థి కళాశాలల్లో చేరేలా పర్యవేక్షణ జరపాలన్నా రు. ఒక జత ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందించామని, రెండో జత యూనిఫామ్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలు త్వరగా కుట్టించి ఇచ్చేలా కృషి చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు స్రవంతి, రజనీ, నాగోరావు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి
పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలల్లో చేరేలా చూడాలి