
మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
సాక్షి నెట్‌వర్క్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పలువురు అధికారులు, ఎస్సైలు సూచించారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో పోలీస్, విద్య, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ, 2కె రన్ నిర్వహించారు. పలు చోట్ల మానవహారంగా ఏర్పడి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తుపదార్థాల నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రం అందజేశారు.

మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ