
గిరిజనులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్: గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లో ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న ఆలిండియా బంజారా సేవా సంఘం సభ్యులు జిల్లా ఆదివాసి గిరిజన అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సభ్యులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రనాయక్, కేతావత్ ప్రకాశ్ పాల్గొన్నారు.