
బీజేపీలో పలువురి చేరిక
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మాజీ ఎంపీపీ కంతి అనంత్‌రెడ్డి గురువారం బీజేపీలో చేరారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. కిషన్‌రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, జక్రాన్‌పల్లి పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, వంశీగౌడ్, కుంట శ్రీనివాస్, బొజ్జ సంజీవ్, విక్రమ్ పటేల్, మునిపల్లి నాయకులు క్యాతం రాజారెడ్డి, పోగుల భాస్కర్, క్యాతం రాజేశ్వర్, కృష్ణ, క్యాతం శ్రీధర్, సీహెచ్ గంగారెడ్డి, నవీన్, సంతోష్, కొలిప్యాక సాయిరెడ్డి పాల్గొన్నారు.