
దాబా, హోటళ్లపై పోలీసుల దాడులు
నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్–సంగారెడ్డి 161 జాతీయ రహదారి వెంబడి ఉన్న దాబాలు, రెస్టారెంట్‌లపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లోని జాతీయ రహదారి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా మద్యం సిట్టింగులు, విక్రయాలు జరుపుతున్న దాబాలపై దాడి చేసి, అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్య సిట్టింగులు నిర్వహిస్తున్న దాబా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.