
5.25 కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అనంతరం ఒక బ్యాగులో ఉన్న 5.25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం ఎండు గంజాయిని, నిందితుడిని, సెల్‌ఫోన్‌ను నిజామాబాదు రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్ తెలిపారు.