టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి

Jun 27 2025 4:13 AM | Updated on Jun 27 2025 4:13 AM

టీచిం

టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రంలోని యూనివర్సిటీల లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు రఘురాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఏ ఐఎస్‌ఎఫ్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, అభివృద్ధి కోసం అధి క నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. అలాగే పీజీ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందిన ప్రతి విద్యార్థికి ఉచితంగా మెస్‌, హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశా రు. కన్వీనర్‌ సంజీవ్‌, కో కన్వీనర్‌ చందు, నా యకులు అజయ్‌, నవీన్‌, కుషాల్‌, టోకు, లక్ష్మణ, చతుర్‌ సింగ్‌, పీరు పాల్గొన్నారు.

పాఠశాల గది సీజ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని నారాయణ పాఠశాలలో బుక్స్‌, దుస్తులు విక్రయిస్తున్న గదిని అధికారులు గురువారం సీజ్‌ చేశారు. పాఠశాలలో బుక్స్‌, దుస్తులు విక్రయిస్తున్నట్లు టీజీవీపీ నాయకులు ఎంఈవోకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చి విచారించిన ఎంఈవో బుక్స్‌ విక్రయిస్తున్నట్లు తేలడంతో గదిని సీజ్‌ చేయించారు.

సమ్మెను జయప్రదం చేయాలి

నిజామాబాద్‌ సిటీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని, సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు భూమన్న, దాసు కోరారు. నగరంలోని కోటగల్లి ఎన్‌ఆర్‌భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ చట్టాలు వర్తింపజేసి, పని భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు సూర్య, శివాజీ, నీలం సాయిబాబా, మల్లికార్జున్‌, శివకుమార్‌, జేపీ గంగాధర్‌, వి బాలయ్య, భారతి, మోహన్‌, రాజు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని కానిస్టేబుల్‌

జరిమానా విధించిన అధికారులు

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించారు. సదరు కానిస్టేబుల్‌కు చెందిన బుల్లెట్‌ బండి శబ్ద కాలుష్యంతో ప్రయాణించడంతో రూ.1400 జరిమానా విధించినట్టు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ గురువారం తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని ట్రాఫిక్‌ పోలీస్‌కే జరిమానా విధించడం పోలీస్‌ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

ఈ–కేవైసీ తప్పనిసరి

నస్రుల్లాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సహాయం కోసం రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేసుకోవాలని ఏఈవో గ్రీష్మ అన్నారు. అందులో భాగంగా మిర్జాపూర్‌ క్లస్టర్‌కు సంబందించి 34 మంది చేసుకోలేదని తెలిపారు. ఈసందర్భంగా గురువారం కామిశెట్టిపల్లిలో ఫేసియల్‌ యాప్‌ ద్వారా కేవైసీ చేశామన్నారు. డబ్బులు పడుతూ కేవైసీ చేసుకోని వారు ఉన్నా కూడా తప్పకుండా ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించారు.

టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి 1
1/1

టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement