
క్రైం కార్నర్
బైక్‌ను ఢీకొన్న బస్సు : ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్‌లో బైక్‌ను ఓ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కోటార్మూర్‌కు చెందిన మామిడి మహేష్ (38) గురువారం ఉదయం తన బైక్‌పై తన భార్య లావణ్యను మహిళా ప్రాంగణ సమీపంలో ఓ పనికి దించి ఇంటికి బయలుదేరాడు. కాగ కోటార్మూర్‌లోని తిరుపతి ఆస్పత్రి వద్ద అతడి బైక్‌ను జగిత్యాల డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్‌కు తీవ్రమైన గాయాలవ్వడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
పాముకాటుతో ఒకరు..
కామారెడ్డి క్రైం: గుడిసెలో నిద్రిస్తుండగా పాము కా టు వేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కా మారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భుక్యా కపుర్యా (30) వ్యవసాయం, కూలీ పనులు చేసుకునేవాడు. అతనికి గతంలో వివాహం జరుగ గా భార్యతో విడాకులు అయ్యాయి. అతడు బుధ వారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. వేకువజామున మెలకువ వచ్చి చూసుకోగా పాము కాటుకు గురైనట్లు గుర్తించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. అర్ధరాత్రి విషసర్పం కాటు వేసి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్