
బెండ సాగు.. బహు బాగు
నిజామాబాద్ జిల్లాలో రైతులు వరి, మొక్కజొన్న, టమాటా పంటలే కాకుండా కూరగాయల సాగును సైతం చేపడుతున్నారు. ఈనేపథ్యంలోనే మాక్లూర్ మండలం కృష్ణానగర్ గ్రామ శివారులో స్థానిక రైతు నర్సింలు తనకున్న 5 ఎకరాల్లో బెండకాయ తోట సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం కాయలు కాయడంతో నిత్యం కూలీలు వచ్చి, బెండకాయలను తెంపుతూ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గురువారం తోటలో కూలీలు బెండకాయలను తెంపుతుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. నిత్యం నిజామాబాద్ మార్కెట్‌కి పంటను తీసుకువచ్చి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నట్లు రైతు తెలిపారు.
–సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్, నిజామాబాద్

బెండ సాగు.. బహు బాగు