
ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభం
మీకు తెలుసా?
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ పార్టీ వారైనా ఎన్నికల ప్రచారాన్ని మండలంలోని శ్రీరాంపూర్‌గల చిలుకల చిన్నమ్మ ఆలయం నుంచే ప్రారంభిస్తారు. ఈ అమ్మ ఆలయం నుంచే ప్రచారం ప్రారంభించడం సెంట్‌మెంట్‌గా భావిస్తారు.
● శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన శ్రీరాంపూర్ గ్రామం అదే పేరుతో 1963లో బాల్కొండ మండలంలో నూతన గ్రామంగా వెలిసింది. ముంపు గ్రామం నుంచి చిలుకల చిన్నమ్మను తీసుకువచ్చి ఇక్కడ స్థాపించారు.
● భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ఈ ఆలయంలోని చిలుకల చిన్నమ్మ ప్రసిద్ధి చెందింది.
● ప్రతి ఆదివారం, గురువారం ఆలయం వద్ద సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.
● ప్రతి సంవత్సరం మాఘ ఆమావాస్య రోజున ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
● చిలుకల చిన్నమ్మ పేరున గ్రామాల్లో చిన్నయ్య, చిన్నమ్మ నామకరణం చేసుకుంటారు.

ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభం