
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్ లీగల్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవా సంస్థ ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ దేశంలో విలువైన మానవ వనరుల్ని మాదకద్రవ్యాలు దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎవరూ మాదకద్రవ్యాలను వినియోగించకుండా చూడాలని, వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, తమపై పెట్టుకున్న ఆశలను మమ్ము చేయకుండా, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు, జడ్జీలు హరీశ, ఆశాలత, వడ్డీ హరికుమార్, శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చీఫ్ రాజ్‌కుమార్ సుబేదార్, అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి