
పసుపు బోర్డు కేంద్రం ఇచ్చిన బహుమతి
సుభాష్‌నగర్ : పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతుల కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జె న్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి గురువారం ఆయ న వీక్షించారు. అనంతరం విలేకరులతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పసుపు బోర్డు కావాలనే 40 ఏళ్ల రైతు ల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం ప్రకటించిందని, ఎంపీ అర్వింద్ కృషితో రాష్ట్ర, జాతీయ పార్టీ నిర్ణయం, ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పడిందన్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏ ర్పాటు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పసుపు బోర్డు తమ రాష్ట్రంలో ఏర్పా టు చేయాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇతర రాష్ట్రాలు అడిగాయని, మోదీ చివరకు నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా జిల్లాకు చెందిన రైతుబిడ్డనే నియమించారన్నారు. ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు కా ర్యాలయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చనుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు. రైతు సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలకు నిజామాబాద్ జిల్లా కేంద్రబిందువని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం తర్వాత బోర్డు లోగోను అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు.
రైతు సమ్మేళనానికి తరలిరావాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు స మ్మేళన బహిరంగ సభకు హాజరవుతారని, రై తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఎంపీ అ ర్వింద్ ధర్మపురి పిలుపు నిచ్చారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరె డ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, నాయకులు బద్దం లింగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మోరెపల్లి సత్యనారాయణ, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, బోగ శ్రావణి, గోపిడి స్రవంతిరెడ్డి, అ డ్లూరి శ్రీనివాస్, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్, మాదాసు స్వామి యాదవ్, పంచరెడ్డి ప్రవళిక పాల్గొన్నారు.
కేంద్రమంత్రి, బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి
ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిని
కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది
నిజామాబాద్ జిల్లా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువు
అమిత్ షా సభను జయప్రదం చేయాలని పిలుపు