
పాలిటెక్నిక్ మైదానం పరిశీలన
సుభాష్‌నగర్: ఈ నెల 29న రైతు సమ్మేళన బహి రంగ సభ జరిగే పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ ధ ర్మపురి గురువారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా సభ ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, హెలీప్యాడ్ తదితర వివరాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభా వేదిక, భద్రత వంటి వివరాలను ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. అంతకుముందు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి పరిశీలించారు. చైర్మన్, చాంబర్ల ఏ ర్పాటు తదితర పనులపై చైర్మన్ పల్లె గంగారెడ్డి వివరించారు.