
కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలి
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై గురువారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య జిల్లా అధికారులతో సమీక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్‌ను సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కేంద్ర హోం మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ సమీక్ష