
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
ఖలీల్‌వాడి : మాదకద్రవ్యాలను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీ పోతరాజు సాయి చైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు గురువారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమని స్తూ ఉండాలన్నారు. బంగారు భవిష్య త్తు ఉన్న యువత కొంతమంది చెడుమార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొ న్నారు. మత్తుకు అలవాటు పడి జీవితా లు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసికస్థితిని కో ల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఏఎస్ కరోలి నా ఛాంగ్ ఎన్ మావీ, ఏసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీసీ సోమిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
సీపీ సాయి చైతన్య