
సరదాతో పొంచి ఉన్న ప్రమాదం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకులు నీటి అంచున సరదా కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్‌లో మునిగి పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక మంది యువకులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. కానీ పర్యాటకులు నీటి లోపలికి వెళ్లకుండా ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రాజెక్ట్ అధికారులు స్పందించి వెంటనే పర్యాటకులు నీటి లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
సకాలంలో సిలబస్
పూర్తి చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సకాలంలో సిలబస్ పూర్తి చేసి 2025–26 విద్యాసంవత్సరాన్ని విజయవంతం చేయాలని తెయూ వీసీ యాదగిరిరావు సూచించారు. యూనివర్సిటీలో బుధవారం ఆయన రిజిస్ట్రార్ యాదగిరి, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌లతో కలిసి వివిధ విభాగాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ప్రతి విభాగం నుంచి వర్తమాన సాంకేతిక అంశా లపై సదస్సులు, సింపోజియం, వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు.పరీక్షలు వాయిదా వేయ రాదని, సమయానికి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయాలని స్పష్టం చేశారు.
తక్షశిలకు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ హిందీ విభాగంలో పరిశోధకురాలు తక్షశిల పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించారు. హిందీ విభాగాధ్యక్షురాలు పార్వతి మార్గనిర్దేశనంలో ‘హిందీ దళిత మహిళా ఆత్మకథా వోమే యదార్థ వాద’ అనే అంశంపై తక్షశిల పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మినీ సెమినార్ హాల్‌లో బుధవారం నిర్వహించిన ఓపెన్ వైవాకు ఇఫ్లూ హిందీ హెచ్‌వోడీ రేఖారాణి ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. డాక్టరేట్ సాధించిన తక్షశిలను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, అధ్యాపకులు అభినందించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్ లావణ్య, బీవోఎస్ చైర్మన్ మహ్మద్ జమీల్ అహ్మద్, హెచ్‌వోడీ పార్వతి, ప్రిన్సిపాల్ ప్రవీణ్, ప్రొఫెసర్ కనకయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.
డైట్ ప్రవేశాలకు
27న సర్టిఫికెట్ల పరిశీలన
కామారెడ్డి అర్బన్: డైట్‌లో ప్రవేశాల కోసం సర్టి ఫికెట్ వెరిఫికేషన్ పొందని అభ్యర్థులు ఈనెల 27న హాజరు కావాలని నిజామాబాద్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్, వెబ్ ఆధారిత ప్రాధాన్యతలకు ఈనెల 28 నుంచి 30 వరకు పాల్గొనవచ్చన్నారు. తొలి విడత సీటు పొందని కొత్త అభ్యర్థులు సైతం వెబ్ ప్రాధాన్యతలు ఇవ్వడంతో పాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి జూలై 1 వరకు అవకాశం ఉందన్నారు. రెండో విడత అభ్యర్థులకు సీట్లు, కళాశాల కేటాయింపు జూలై 5న జరుగుందన్నారు.

సరదాతో పొంచి ఉన్న ప్రమాదం

సరదాతో పొంచి ఉన్న ప్రమాదం