
కరెంట్ షాక్‌తో స్తంభంపైనే ఒకరి మృతి
బోధన్: విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగుల లాగుతుండగా ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. నవీపేట ఎస్సై వినయ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట మండలం లింగాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో గ్రామానికి చెందిన దినసరి కూలి రెంజర్ల పోశెట్టి (44) బుధవారం ఇదే గ్రామానికి చెందిన రైతు కళ్లెం శివ పొలంలో కరెంట్ బోరుబావి వద్ద పనికి వెళ్లాడు. బోరుబావికి సంబంధించిన సర్వీస్ వైర్‌ను 11కేవీ లైన్ తీగలున్న స్తంభంపైకి ఎక్కి లాగుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాముకాటుతో మహిళ..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని వజ్జపల్లి గ్రామంలో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని చర్ల చిన్నమ్మ (52) అనే మహిళ బుధవా రం వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే ఆమె మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త భూమయ్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..
రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులో బుధవారం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలి కడారి చిన్న సాయిలు (37) మృతదేహం లభ్యమయింది. పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రుద్రూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా రుద్రూర్‌కు చెందిన కడారి చిన్న సాయిలుగా గుర్తించారు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల అతడు మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య బాలామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

కరెంట్ షాక్‌తో స్తంభంపైనే ఒకరి మృతి

కరెంట్ షాక్‌తో స్తంభంపైనే ఒకరి మృతి

కరెంట్ షాక్‌తో స్తంభంపైనే ఒకరి మృతి