
మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
నిజామాబాద్‌అర్బన్: మత్తు పదార్థాలు, మాదక ద్ర వ్యాల నియంత్రణే లక్ష్యమని, ఇందుకోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో బుధవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్, సీపీ సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి వాటిని కట్టడి చేయడానికి గట్టి నిఘా ఉంచాలన్నారు.
కొంతమంది గర్భిణులు కల్తీ కల్లు సేవిస్తున్నట్లు తెలుస్తోందని, ఇది పుట్టబోయే బిడ్డతోపాటు మహిళ ఆరోగ్యంపై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూ చించారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, డీఈవో అశోక్, డీఏవో వీరాస్వామి, డీఎఫ్‌వో సుధాకర్, డీటీవో ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
విస్తృత స్థాయిలో అవగాహన
కార్యక్రమాలు చేపట్టాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,
సీపీ సాయి చైతన్య
కలెక్టరేట్‌లో అధికారులతో
జిల్లాస్థాయి సమావేశం