
‘అతిసార’ నియంత్రణకు చర్యలు చేపట్టాలి
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో చేతుల శుభ్రత, ఓఆర్‌ఎస్ ద్రావణం తయారీ విధానంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు వివరించాలన్నారు. ప్రతి గ్రామంలోని నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని సూచించారు. శుద్ధి చేసిన నీటినే తాగాలని ప్రజలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో అవగాహన క ల్పించాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ మెంబర్లకు సూచించారు. ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు ప్రతి అంగన్‌వాడి, పాఠశాలల్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో ప్ర త్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం అతిసార వ్యా ధిపై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 31 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో అతి సార వ్యాధితో కలిగే మరణాలను తగ్గించడమే ల క్ష్యంగా ఈ కార్యక్రమం ఉందన్నారు. జిల్లాలో అతిసార వ్యాధితో ఏ ఒక్కరూ మరణించకుండా చర్య లు తీసుకుంటామని ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ తెలిపారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యూవో రసూల్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ ధర్మేందర్, మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ రాజు, పీవోలు రాజు, సుప్రియ, సానిటరీ ఇన్‌స్పెక్టర్ షాదుల్లా, సీ డీపీవో సౌందర్య, డీపీహెచ్‌ఎన్‌వో స్వామి సులోచ న, డీహెచ్‌ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు, రాజాబాబు, సచిన్, తరుణ్, వినోద్, వైద్య సిబ్బంది ఉన్నారు.
అడిషనల్ కలెక్టర్ అంకిత్
నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలి