
‘ఎమర్జెన్సీ డే’ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం
సుభాష్‌నగర్: భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ డే చీకటి దినమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లిన వుల్సే రాజేశ్వర్, పుప్పాల రాజేందర్, భూసారి గోవర్ధన్, చెలివేలి శ్రీధర్‌ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమైపె పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసువేశారు. 4ఏళ్ల విచారణ తర్వాత 1975 జూన్ 12న ఇందిరా ఎన్నిక చెల్లదని, 6ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయొద్దని కోర్టు తీర్పునిచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ లు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా, 1975 జూన్ 25న అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు. దాదాపు రెండేళ్లు దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించారని విమర్శించారు. అధికారం కోసం ప్రధానమంత్రే నియంతగా మారిన ఒకే ఒక ప్రధాని ఇందిరాగాంధీ అని ఆరోపించారు. నాయకులు పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్, పంచరెడ్డి ప్రవళిక, ఇప్పకాయల కిషోర్, కోడూరు నాగరాజు, తారక్ వేణు, పద్మారెడ్డి, సందీప్, మాస్టర్ శంకర్, జగన్‌రెడ్డి, పడాల భూపతి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.