
గేట్‌వేగా జిల్లా..
ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్‌వే గా జిల్లా ఉంది. డ్రై పోర్టు ఏర్పాటు చేస్తే వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. 1980–90లలో నిజామాబాద్ వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు 20 టన్నుల సామర్థ్యం కలిగిన రైల్వే గూడ్స్ ర్యాక్‌లను బుక్ చేసుకునేవారు. ఇప్పుడు పెద్ద మొ త్తంలో ఎగుమతి చేస్తేనే రైల్వే శాఖ అవకాశం కల్పిస్తోంది. డ్రైపోర్ట్ వస్తే 24 టన్నుల కంటెయినర్‌లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
– హితేన్ భీమాని, కోశాధికారి చాంబర్ ఆఫ్ కామర్స్