
‘భూ భారతి’ దరఖాస్తులను పరిష్కరించాలి
నిజామాబాద్‌అర్బన్: భూ భారతి రెవెన్యూ సదస్సు ల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15 నాటికి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభు త్వ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు సూచించా రు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయ న మాట్లాడారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం పాల్గొనగా.. వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్‌పామ్ పంట విస్తర ణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురవకముందే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌తోపాటు బేస్మెంట్‌స్థాయి వరకు పనులు పూర్త య్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ, సీనరేజీ చార్జీలను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. డబుల్ బె డ్ రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. లాభసాటి పంట అయిన ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు పటిష్ట చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. లక్ష్యం మేరకు వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటాలని మంత్రి సురేఖ ఆదేశించారు.
కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఇప్పటికే 19,490 ఇండ్లు కేటాయించగా, 15,834 మందికి ప్రొసీడింగ్స్ అందించామని, 7181 ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ పూర్తయ్యిందని వివరించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలి స్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అలాగే జిల్లాలో 7075 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని సీఎస్‌కు తెలిపారు. అదన పు కలెక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 15 నాటికి పూర్తయ్యేలా
చర్యలు తీసుకోవాలి
భారీ వర్షాలకు ముందే ఇందిరమ్మ
ఇళ్ల గ్రౌండింగ్ పూర్తవ్వాలి
ఆయిల్‌పామ్ పంట సాగు
విస్తరణకు చర్యలు
వీడియోకాన్ఫరెన్స్‌లో
సీఎస్ రామకృష్ణారావు