
చదివింది పీజీ.. చేస్తోంది పారిశుధ్య పని
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆమె ఉన్నత విద్యావంతురాలు.. పీజీ, బీఈడీ పూర్తి చేసింది. తండ్రి పారి శుధ్య కార్మికుడు.. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ పోషణకు కూతురు ఆ పనిలో చే రింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బల్దియా ప రిధిలోని దేవునిపల్లికి చెందిన శ్యామల దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. కామారెడ్డిలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. త ర్వాత పీజీ, బీఈడీ కూడా చదివింది. శ్యామల తండ్రి నాగయ్య మూడు దశాబ్దాలపాటు పారిశుధ్య కా ర్మికుడిగా పనిచేశాడు. ఆయన అనారోగ్యానికి గురవగా.. 2021లో ఆయన స్థానంలో శ్యామలను కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగంలో చేర్చుకున్నారు. కొద్దిరోజులకే శ్యామల తండ్రి నాగయ్య చనిపోయా డు. కాగా పీజీతో పాటు బీఈడీ చదివిన శ్యామల పారిశుధ్య కార్మికురాలిగా పనిచేయడానికి అనేక ఇ బ్బందులు పడుతోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం, రో డ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనుల న్నీ చేయాల్సి ఉంటుంది. అ ప్పట్లో మున్సి పల్ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి తన చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. అ యినా ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. డ్రెయినేజీ లు శుభ్రం చేయడం మూలంగా ఆరోగ్యం కూడా దెబ్బతిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన చదువును చూసి మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటోంది.
తండ్రి స్థానంలో కార్మికురాలిగా చేరిక
చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని
కోరుతున్న శ్యామల